ప్రజల జీవన ప్రమాణాల పెంపే నిజమైన అభివృద్ధి: మంత్రి హరీష్ రావు

by Kalyani |
ప్రజల జీవన ప్రమాణాల పెంపే నిజమైన అభివృద్ధి: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర అర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీజేఆర్ చౌరస్తా వద్ద రూ.25 కోట్ల తో చేపట్టనున్న సమీకృత మార్కెట్ భవన సముదాయ నిర్మాణ పనులకు జడ్పీ చైర్మన్ రోజాశర్మ, స్థానిక కౌన్సిలర్ కొండం కవిత సంపత్ రెడ్డి, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి హరీశ్ రావు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు అన్ని వసతులతో కూడిన మార్కెట్ అందుబాటులోకి తీసుకరావాలనే ఉద్దేశంతో సమీకృత మార్కెట్ భవన సముదాయ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాలసాయిరాం, బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story