ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్: మంత్రి హరీష్ రావు

by Naresh |   ( Updated:2023-08-30 09:45:07.0  )
ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: జిల్లా ప్రజలకు మంత్రి హరీష్ రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కా తమ్ముళ్ల, అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బందన్ అని అన్నారు. సిద్దిపేట నియోజకవర్గం అన్నింటిలో ఆదర్శంగా నిలుస్తున్నది, ప్లాస్టిక్ నిర్మూలించే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని, రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్లాస్టిక్ తో తయారు చేసే రాఖీలు కాకుండా సహజ సిద్ధంగా ఉండే ఆకులు, పువ్వులతో ఈ ఏటా నుండే తమ్ముళ్లకు అన్నయ్యలకు " ఏకో ప్రెండ్లి రాఖీ " కట్టాలన్నారు. సిద్దిపేట నియోజకవర్గ మహిళలు స్పూర్తిగా నిలుస్తున్నారని, మానవ ఆరోగ్యం పట్ల ఆలోచించి మహిళలు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఇదే స్పూర్తితో నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.

Advertisement

Next Story