ఓటు హక్కును వినియోగించుకున్న Raghunandan Rao

by Naresh |   ( Updated:2023-11-30 05:22:47.0  )
ఓటు హక్కును వినియోగించుకున్న Raghunandan Rao
X

దిశ, దుబ్బాక: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు తన సొంత గ్రామమైన బొప్పాపూర్ గ్రామంలో మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.... డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకోవడం జరిగిందన్నారు. జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు. బుధవారం రాత్రి ఎవరిని ఇబ్బందులకు గురిచేసిన ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి పేద ప్రజల పక్షాన ఉండేటటువంటి సకలజనుల కోసం పనిచేసేటటువంటి సౌభాగ్య తెలంగాణ కోసం ప్రజలు మార్పు కోసం ఓటు వేస్తున్నారని సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు.

Advertisement

Next Story