ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కారంః కలెక్టర్ వల్లూరు క్రాంతి

by Nagam Mallesh |
ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కారంః కలెక్టర్ వల్లూరు క్రాంతి
X

దిశ, సంగారెడ్డి : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యలకు సత్వరమే పరిష్కారం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 23 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 23 అర్జీలు రాగా రెవెన్యూ 12, సర్వే ల్యాండ్ రికార్డ్ 1, పంచాయతీరాజ్ 3, మునిసిపల్ శాఖ 5, వ్యవసాయశాఖ 2 వచ్చాయని కలెక్టర్ తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పరిష్కారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ , సంగారెడ్డి ఆర్ డీఓ వసంత కుమారి, జిల్లా అధికారులు సాయిబాబా, జగదీష్, నరసింహ, అఖేలేష్ రెడ్డి, జడ్పీసీఈఓ జానకిరామ్, డీఏంఅండ్ హెచ్ఓ గాయత్రీదేవి, సంబంధిత జిల్లాధికారులు, ఏవో పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story