మంత్రి కేటీఆర్ ప్రోగ్రాంకు వెళ్లకుండా.. విలేకరులను అడ్డుకున్న పోలీసులు

by Hamsa |   ( Updated:2023-01-30 07:32:48.0  )
మంత్రి కేటీఆర్ ప్రోగ్రాంకు వెళ్లకుండా.. విలేకరులను అడ్డుకున్న పోలీసులు
X

దిశ, మనోహరాబాద్: మంత్రి కేటీఆర్ ప్రోగ్రాంకు అక్రిడేషన్ కార్డులు లేని విలేకరులను పోలీసులు అడ్డుకున్నారు. మండల కేంద్రమైన మనోహరాబాద్ లో నూతనంగా నిర్మించిన ఐటీసీ ఫుడ్ పరిశ్రమ ను సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న రిపోర్టర్లను సమావేశానికి రావద్దంటూ పోలీసులు అడ్డుకున్నారు. అక్రిడేషన్ కార్డులు కలిగిన తూప్రాన్ మండల రిపోర్టర్లకు, మండలంలోని ఇద్దరు, ముగ్గురికి అక్కడేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే అనుమతిచ్చారు. గత నెల క్రితం అక్రిడేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే మండలంలోని ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో భూములు కోల్పోయిన రైతులకు కేటాయించిన స్థలంలో బాధిత రైతులతో పాటు అక్రిడేషన్లు కలిగిన తూప్రాన్ మండల విలేకరులకు మాత్రమే బీపీఎల్ కోట కింద ఇండ్ల స్థలాలను అధికారులు పంపిణీ చేశారు.

దీంతో స్థలము ఇల్లు లేని నిరుపేద అయిన మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ పత్రిక రిపోర్టర్ రమేష్ తన గోడును సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. మంత్రిని అడ్డుకుంటామని కూడా ప్రచారం చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం ఉదయమే రమేష్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇది గమనించిన పోలీసు అధికారులు అక్రిడేషన్ కార్డులు లేని, ఇండ్ల ప్లాట్లు రాణి విలేకరుల లిస్టును పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మండల రిపోర్టర్లు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇలాకాలో అధికారులు అక్రిడేషన్ కార్డుల ఆంక్షలు పెట్టి ఎక్కడా లేని విధంగా ఇండ్ల స్థలాలను తమకు మంజూరు చేయలేదని, అక్రిడేషన్ కార్డులు ఉన్న తూప్రాన్ మండలానికి చెందిన విలేకరులకు మనోరాబాదులో ప్లాట్లు ఇచ్చి స్థానికంగా ఉన్న రిపోర్టర్లకు మొండి చేయి చూపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: కలెక్టరేట్ ఎదుట అధికార పార్టీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం (వీడియో)


Advertisement

Next Story