ప్రణాళికబద్ధంగా కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే

by Kalyani |
ప్రణాళికబద్ధంగా కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే
X

దిశ, అమీన్ పూర్ : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్ చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ సాయి యాక్సిస్ హోమ్స్ కాలనీలో రూ.60 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాలు పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

అమీన్ పూర్ మండల పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడం మూలంగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడంతో పాటు అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ రూ.10 లక్షలసొంత నిధులను అందించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed