2వ రోజు ముగిసిన దేహదారుడ్య పరీక్షలు.. ఎంతమంది క్యాలిఫై అయ్యారంటే..?

by Satheesh |   ( Updated:2022-12-09 15:08:56.0  )
2వ రోజు ముగిసిన దేహదారుడ్య పరీక్షలు.. ఎంతమంది క్యాలిఫై అయ్యారంటే..?
X

దిశ, సంగారెడ్డి: ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు ఎస్పీ రమణకుమార్ పర్యవేక్షణలో 2వ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. రెండో రోజు నిర్వహించిన దేహదారుడ్య పరీక్షలలో భాగంగా 800 మంది పురుష అభ్యర్థులకు గాను 672 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 264 మంది అభ్యర్థులు ఫైనల్ రాత పరీక్షకు అర్హత సాధించగా.. 408 మంది డిస్ క్వాలిఫై అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ దేహదారుఢ్య పరీక్షలలో అర్హత సాధించని అభ్యర్థులు ఎవరు కూడా అధైర్య పడకుండా.. రాష్ట్ర ప్రభుత్వం వెలువరుస్తున్న అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో పాల్గొని తమ ప్రతిభను చూపాలన్నారు. పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్న పరీక్షలలో అభ్యర్థులు ఎంతో కష్టపడ్డారని, కష్టపడ్డ వారు తప్పకుండా విజయం సాధిస్తారన్నారు.

Advertisement

Next Story

Most Viewed