మైనార్టీల సంక్షేమానికి పెద్దపీఠ : Minister Thaneeru Harish Rao

by Sumithra |   ( Updated:2023-08-27 16:05:29.0  )
మైనార్టీల సంక్షేమానికి పెద్దపీఠ : Minister Thaneeru Harish Rao
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : మైనార్టీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు. హరీష్ రావు అన్నారు. సిద్దిపేట నియోజక వర్గానికి చెందిన మైనార్టీ కాంగ్రెస్ నాయకులు అతిక్ అహ్మద్, సజ్జు బాయ్ తో పాటుగా వందమంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి మంత్రి హరీష్ రావు గులాబీ కండవాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో ముస్లింల సంఖ్య తక్కువ అయినప్పటికి మైనార్టీలకు బడ్జెట్ లో పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. హిందువులకు బతకమ్మ చీరల పంపిణీ మాదిరిగా, మైనార్టీలకు రంజాన్ కి తోపా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. మైనార్టీల ఆర్ధిక అభ్యున్నతి కోసం మైనార్టీ బంధు పథకం, షాది ముబారక్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత సిద్దిపేట లోనే హజ్ హౌస్, దేశములో మొట్టమొదటి షాది ఖాన సిద్దిపేట లోనే ఉందన్నారు.

రూ.20 లక్షలు సిద్దిపేట తాంజిమ్ కు సహాయం చేసినట్లు గుర్తు చేశారు. అదే విధంగా సిద్దిపేట నియోజక వర్గంలో 2600 డబుల్ బెడ్ రూంలు పంపిణీ చేస్తే అందులో 650 మైనార్టీలకు కేటాయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మైనార్టీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో హిందు, ముస్లిం గొడవలు లేవని, మత సామరస్యానికి ప్రతీకగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి, వేలేటీ రాధ కృష్ణ శర్మ, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్న గుండవెళ్లి, హనుమంతుపల్లి, ఇరుకోడ్, సిద్దిపేట పట్టణ హనుమాన్ నగర్ ముదిరాజ్ సంఘాలు ప్రతినిధులు మంత్రి తన్నీరు. హరీష్ రావుకే మా ఓటు అని ఏకగ్రీవ తీర్మానాలు చేసి తీర్మాణ ప్రతులను మంత్రి హరీష్ రావుకు క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులకు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.

Advertisement

Next Story

Most Viewed