నాడు రేవంత్​ రెడ్డిపై కేటీఆర్​ కేసులెందుకు పెట్టారు

by Sridhar Babu |
నాడు రేవంత్​ రెడ్డిపై కేటీఆర్​ కేసులెందుకు పెట్టారు
X

దిశ, సంగారెడ్డి : నాటి మంత్రి కేటీఆర్ తన జన్వాడ ఫాంహౌస్‌పై డ్రోన్లు ఎగురవేశారని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసులు పెట్టారని, ఇప్పుడు ఆ ఫాం హౌజ్ నాదికాదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో రఘునందన్ రావు మాట్లాడుతూ మంత్రి హోదాలో కేటీఆర్ ఆ ఫాం హౌజ్ తనది కాదని అప్పుడే చెప్పొచ్చు కదా.. ఆ ఫాంహౌస్ నీది కాదని ఇప్పుడెందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నావ్ కేటీఆర్ అంటూ ప్రశ్నించారు.

ఆ రోజు ఫాం హౌజ్ నీదికాదని మంత్రి హోదాలో చెప్పనుంటివని, దొంగలు దొంగలు ఏదో పంచుకున్నట్లు ఉంది వ్యవహారం అన్నారు. హైడ్రా పేరిట ప్రతి పక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను టార్గెట్ చేయొద్దన్నారు. నిజంగా సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం చెరువులో, శిఖంలో, బఫర్ జోన్ లో రఘునందన్ రావు కట్టినా, దామోదర్ కట్టినా, కేటీఆర్ కట్టినా, కవిత కట్టినా దయాదాక్షిణ్యాలు లేకుండా 24 గంటల్లో కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story