Oil farm cultivation : ఆయిల్ ఫాం సాగు అత్యంత లాభదాయకం

by Sridhar Babu |
Oil farm cultivation : ఆయిల్ ఫాం సాగు అత్యంత లాభదాయకం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఆయిల్ ఫాం సాగు అత్యంత లాభదాయకమని కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయిల్ ఫెడ్, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...వచ్చే ఏడాది మార్చి లోపు ఆయిల్ ఫాం కర్మాగారం పూర్తి కానున్న నేపథ్యంలో జిల్లాలో లక్ష్యానికి అనుగుణంగా 4వేల ఎకరాల్లో

ఆయిల్ ఫాం పంట సాగు అయ్యేలా అధికారులు రైతులను ప్రోత్సహించాలన్నారు. పెద్ద భూ స్వాములనే కాకుండా చిన్న, సన్న కారు రైతులను కూడా ఆయిల్ ఫాం వైపు మళ్లించాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖ, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అధికారులు అందరూ సమన్వయంతో 100 శాతం లక్ష్యాన్ని చేరే విధంగా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మహేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, ఆయిల్ ఫెడ్ కన్సల్టెన్సీ అధికారి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed