- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ భూమి కబ్జా.. కన్నేసిన రియల్ వ్యాపారులు
దిశ, నర్సాపూర్: హైదరాబాద్ మహనగరానికి అతి దగ్గరగా ఉండటంతో భూముల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. పట్టా భూములతో పాటు ప్రభుత్వ భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రియల్ వ్యాపారుల కన్ను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములపై పడింది. నర్సాపూర్ సంగారెడ్డి ప్రధాన రోడ్డు పక్కన ఉన్న అతి విలువైన, కోట్లు ధర పలికే భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సంగారెడ్డి నర్సాపూర్ రహదారి పక్కనే బి,వి, ఆర్ ఐ టి కళాశాల సమీపంలో గల సర్వే నంబర్ 89/1,89/2,89/3,100 గల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ కు చెందిన కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూమిలో ఉన్న చెట్లు, ముళ్ళ పొదలు తొలగించారు. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయడానికి కడీలు తెచ్చి సిద్ధంగా ఉంచారు. ఇదే విషయమై మండల పరిధిలోని రామచంద్రాపూర్ గ్రామానికి చెందిన కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే రెవెన్యూ సిబ్బంది కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాపాడి స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు.