ఏడాది కాంగ్రెస్ పాలనకు ఒరగబెట్టిందేమి లేదు : ఎమ్మెల్యే

by Kalyani |
ఏడాది కాంగ్రెస్ పాలనకు ఒరగబెట్టిందేమి లేదు : ఎమ్మెల్యే
X

దిశ, సంగారెడ్డి : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, గడిచిన ఏడాది పాలనలో రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. ఏడాది కాలంలోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని, రెండు లక్షల రుణమాఫీకి ఎగనామం పెట్టారని, వడ్లకు బోనస్ బోగస్ అయ్యిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 100 రోజుల్లోనే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారని, గ్యారంటీల అమలుపై తొలి సంతకం పెడతామని రాష్ట్ర కాంగ్రెస్ నేతల నుంచి జాతీయ కాంగ్రెస్ నేత వరకు వాగ్దానాలు చేశారని ఎద్దెవా చేశారు. వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 350 రోజులు గడుస్తున్న హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా కుట్రలు చేస్తుందన్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు

Advertisement

Next Story

Most Viewed