- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌లో వర్గపోరు.. ఇప్పేపల్లి సొసైటీ అధ్యక్ష పదవీపై అవిశ్వాసం
దిశ, జహీరాబాద్: ఇప్పేపల్లి సొసైటీలో చీలికలు ఏర్పడ్డాయి. ఆధిపత్య పోరులో అధ్యక్ష పదవిపై అవిశ్వాసం పెట్టారు. 15వ తేదీన అవిశ్వాస తీర్మానంపై బలపరీక్ష నిర్వహించనున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. నాయకుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రమై అవిశ్వాసానికి దారితీసింది. పార్టీకి చెందిన అసమ్మతి నేతలు ఉమ్మడి జహీరాబాద్ మండలంలోని ఇప్పేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) అధ్యక్ష పదవిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ప్రస్తుతం ఇప్పేపల్లి సొసైటీ అధ్యక్షుడిగా కిషన్ రావు పవార్ కొనసాగుతుండగా హోతి(బి) నుంచి డైరెక్టర్‌గా ఎన్నికైన మశ్చందర్ తిరుగుబావుటా ఎగురవేశారు. ఎనిమిది మంది డైరెక్టర్లు ఆయనకు మద్దతుగా నిలిచారు.
అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే తనతోపాటు తొమ్మిది మంది డైరెక్టర్ల మద్దతు అవసరం. ఈ మేరకు పూర్తి కోరం మచ్చేందర్‌కు ఉంది. ఇప్పేపల్లి పీఏసీఎస్‌లో 13 మంది సభ్యులుండగా వారిలో అధ్యక్షుడు కిషన్ రావు పవార్, ఉపాధ్యక్షుడిగా వై.మాణిక్యం( హోతి.బి) డైరెక్టర్లుగా చంద్రమ్మ(అల్గోల్ ), మశ్చందర్ (హోతి.బి), సురేశ్ (రాయి పల్లి తండా), హరిసింగ్ (మన్నాపూర్), మొగుడంపల్లికి చెందిన కిషన్, లక్ష్మణ్, బాలరాజు ఉండగా పి.సంజీవరెడ్డి (గౌసాబాద్), జెట్టప్ట (ఔరంగనగ్), బాబు (కొత్తూర్.బి) తదితరులు ఉన్నారు. హోతి( కె) నుంచి నాగప్ప ఉన్నారు.
ఒప్పందాన్ని విస్మరించినందుకే..
ఎన్నికల సందర్భంలో ఇప్పేపల్లి సహకార సంఘం అధ్యక్ష పదవికి జరిగిన పోరులో మొగుడంపల్లి డైరెక్టర్ గా గెలిచిన కిషన్ రావు పవార్, హోతీ(బి) గ్రామం నుంచి గెలిచిన మశ్చందర్ ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ సందర్భంలో దివంగత ఎమ్మెల్సీ ఎండీ. ఫరీదుద్దీన్ సమక్షంలో ఇరువురు 2.5 (రెండున్నర) సంవత్సరాలు అధ్యక్ష పదవిలో కొనసాగాలని తీర్మానించారు. ఈ మేరకు ఇరువురి మధ్య అంగీకారం కుదిరింది. కుదిరిన ఒప్పందం మేరకు సెప్టెంబర్ లో కిషన్ రావు పవార్ పదవికి రాజీనామా చేసి మచ్చేందర్‌కు అధ్యక్షుడిని చేయాలి.
అందుకు ఆయన ససేమిరా అనడం, ఒప్పందం అమలు జరగకపోవడంతో మచ్చేందర్ ఈ విషయాన్ని పలుమార్లు ఎమ్మెల్యే కె.మాణిక్ రావు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కిషన్ రావు రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో వర్గపోరు మొదలైంది. ఫలితంగా అవిశ్వాస తీర్మానానికి పరిస్థితులు దారితీశాయి. 15న జరిగే అవిశ్వాస తీర్మానంలో అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో అప్పటివరకు వేచిచూడాల్సిందే.
శిబిరానికి తరలించారు..
అధ్యక్ష పదవిని ఆశిస్తున్న హోతి(బి) డైరెక్టర్ మశ్చందర్ ఎనిమిది మంది డైరెక్టర్లతో ప్రత్యేక శిబిరానికి వెళ్లిపోయారు. 15న నేరుగా కార్యాలయానికి వచ్చేలా ప్రయాణానికి సిద్ధం చేసుకున్నారు. నియోజకవర్గ పార్టీ అధిష్టానం నాయకుల అండదండలు కూడా వీరికున్నట్లు సమాచారం.