ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలి

by Naresh |
ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలి
X

దిశ, సంగారెడ్డి: నూతన సంవత్సర వేడుకలు జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పిల్లలు, పెద్దలు, యువత ఎంతో ఉత్సాహంగా, అధిక సంఖ్యలో పాల్గొంటారని, జిల్లా పరిధిలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదే విధంగా ట్రాఫిక్, షి టీమ్స్, పెట్రోలింగ్ వంటి పోలీసు బృందాల నిఘా ఉంటుందని జిల్లా ప్రజలు బాధ్యత మరిచి వ్యవహరించరాదని, జిల్లా పోలీసులకు సహకరించాలని కోరారు. 31 నైట్ ప్రయివేట్ ఈవెంట్స్, పార్టీలకు జిల్లా పోలీసు శాఖ నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవలన్నారు.

బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయం లోపు మూసి వేయాలని, మైనర్లకు మద్యం అమ్మే దుకాణదారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రోడ్ల పై నిర్లక్ష్యంగా అధిక వేగంతో, పెద్ద శబ్దాలు చేస్తూ వాహనాలు నడుపుతూ ఇతర సామాన్య జనాలకు ఇబ్బందులు కలిగే విధంగా విహరించరాదన్నారు. 31 నాటి సాయంత్రం నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, మైనర్లకు వాహనాలు ఇచ్చే వాహన యజమానుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గడిచిన సంవత్సరం నుంచి కొత్త పాఠాలు చేర్చుకొని, కొత్త ఆశలతో నూతన సంవత్సరం 2024లోకి అడుగుపెట్టాలని, వివాదాలకు తావులేకుండా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.

Advertisement

Next Story