- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశాన్ని అభివృద్ధి చేసేందుకే బీఆర్ఎస్ పార్టీ.. MLA మదన్ రెడ్డి
దిశ, కౌడిపల్లి: దేశాన్ని అభివృద్ధి చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన ఫథకాలు మంచి ఫలితాలనిచ్చాయని, ఈ పథకాలు దేశ ప్రజలందరికీ అందాలన్నదే బీఆర్ఎస్ లక్ష్యమని తేల్చి చెప్పారు. మంగళవారం ఎంపీపీ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో 57 మందికి ఎమ్మెల్యే కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం వరం లాంటిదని అన్నారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు వంటి అనేక పథకాలతో కేసీఆర్ రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారని పేర్కొన్నారు. అందుకే ఇవాళ దేశం కేసీఆర్ పాలనను కోరుకుంటోందని తెలిపారు. కౌడిపల్లి మండలంలో అంతర్గత బీటీ రోడ్ల నిర్మాణం కోసం రూ. 69.71 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు.
ప్రజల ఆశీర్వాదం ఉంటే నర్సాపూర్ ను అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మదన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కవిత అమర్ సింగ్, కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి, తహసీల్దార్ కమలాద్రి, డిప్యూటీ తహసీల్దార్ తారాబాయి, కౌడిపల్లి కొల్చారం బీఆర్ఎస్ అధ్యక్షుడు రామాగౌడ్, గౌరీ శంకర్, నాయకులు శివాంజనేయులు, మైపాల్ రెడ్డి, అమర్ సింగ్, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.