భారి వర్షాలకు పొంగి పొర్లిన నల్లవాగు ప్రాజెక్టు..

by Sumithra |
భారి వర్షాలకు పొంగి పొర్లిన నల్లవాగు ప్రాజెక్టు..
X

దిశ, కల్హేర్/సిర్గాపూర్ : ఉమ్మడి కల్హేర్ మండలంలోని మధ్యతరహా నల్లవాగు ప్రాజెక్టు నిండి మంగళవారం మత్తడి పొంగి పొర్లింది. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షానికి 8 అడుగుల వరద జలాలతో పూర్తిస్థాయి నీటిమట్టంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 అడుగులు కాగా, ప్రస్తుతం 1493 పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా తలపిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1387 క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, ప్రాజెక్టు డీఈ పవన్ కుమార్, ఏఈ సూర్యకాంత్ తెలిపారు. అలుగు పారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నల్లవాగు ప్రాజెక్ట్ ద్వారా 5 వేల ఎకరాలు సాగు అందిస్తోంది. అదేవిధంగా నల్లవాగు ప్రాజెక్టు పొర్లడంతో కల్హేర్ బద్రప్పల వద్ద కాకి వాగు ఉధృతంగా ప్రహహిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed