- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజాసేవకే నా జీవితం అంకితం.. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
దిశ, సిద్దిపేట ప్రతినిధి : పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా సిద్దిపేట కీర్తి పెంచే విధంగా పనిచేశాను.. ప్రజాసేవకే నా జీవితాన్ని అంకితం చేశాను అంటూ మాజీమంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ సర్వెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ పొందిన సభ్యులకు, పదవ తరగతిలో మండల టాపర్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ... పదేళ్ల పాటు రాష్ట్ర మంత్రిగా, ప్రభుత్వంలో ప్రముఖ స్థానంలో ఉన్నా సమయంలో చీమకు కూడా హాని చేయలేదన్నారు. ప్రేమకు దాతృత్వానికి సేవకు మంచితానానికి మారుపేరుగా పనిచేసినట్టు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద ఈ విధమైన కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇది ఏ రకమైన మంచి పని అని ప్రశ్నించారు. మెడికల్, నర్సింగ్, ఫార్మసీ, మహిళా డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజ్ నెలకొల్పి విద్య క్షేత్రంగా తీర్చిదిద్దితే.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదు కానీ రూ.150 కోట్లతో మంజూరైన వెటర్నరీ కళాశాలను అర్థాంతరంగా రద్దు చేసి కొండగల్ కు తరలించుకొని పోయిందన్నారు. 99 శాతం పనులు పూర్తయిన వెయ్యి పడకల ఆసుపత్రిని మిగిలిన ఒక్క శాతం పనులు పూర్తి చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రహదారుల నిర్మాణంలో ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఊపిరి ఉన్నంత కాలం ప్రజలకు మేలు చేయడానికి.. సేవ చేయడం కోసం జీవితం అంకితం చేస్తానన్నారు. దాడులు ఎంకరేజ్ చేయలేదు.. భవిష్యత్తు లో చేయను అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వంటేరు యాదవ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, పబ్లిక్ సర్వెంట్స్ వెల్ ఫెర్ అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందిన సభ్యులకు, పదవ తరగతిలో మండల టాపర్ విద్యార్థులకు ఘనంగా సన్మానించారు.