మద్యం మత్తులో దారుణం.. అర్థరాత్రి మైనర్ బాలుడు హత్య

by samatah |
మద్యం మత్తులో దారుణం.. అర్థరాత్రి మైనర్ బాలుడు హత్య
X

దిశ, హత్నూర : మద్యం మత్తులో మైనర్ వ్యక్తిని బీరు సీసా తో పొడిచి చంపిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ గ్రామంలో జరిగింది. జిన్నారం సీఐ వేణు కుమార్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కొన్యాల గ్రామానికి చెందిన మంగలి ఆముదయ్య 60 శనివారం రాత్రి దౌల్తాబాద్లో గలా రేణుక ఎల్లమ్మ మద్యం దుకాణంలో మందు తాగడానికి వెళ్ళాడు. ఇదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు అప్పుడప్పుడే పరిచయం అయ్యారు. రాత్రి 11:30 గంటలకు తాగిన మత్తులో ఎం జరిగిందో కానీ కారణం లేకుండా బీరు సీసాను ముక్కలుగా చేసి మైనర్ వ్యక్తి గొంతులో పొడిచాడు. అనంతరం కాలితో తొక్కాడు. ఈ దృశ్యాలు మద్యం దుకాణంలో గలా సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. మృతుని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు జిన్నారం సీఐ వేణుకుమార్ తెలిపారు.

Advertisement

Next Story