కోనాపూర్ అవినీతిపై ఎంపీ ఆరా

by Sridhar Babu |
కోనాపూర్ అవినీతిపై ఎంపీ ఆరా
X

దిశ, మెదక్ ప్రతినిధి : కోనాపూర్ సొసైటీలో రూ. రెండు కోట్ల అవినీతి జరిగితే ఇప్పటి వరకు ఎంత రికవరీ చేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. గురువారం మెదక్ కలెక్టరేట్ లో మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్ లో ఎంపీ మాట్లాడుతూ రామాయంపేట మండలం కోనాపూర్ లో రూ. రెండు కోట్లకు పైగా అవినీతి జరిగిన విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డీసీఓ కరుణ ను కోరారు.

అవినీతి జరిగి ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు రికవరీ ఎందుకు చేయలేదన్నారు. కోర్టు స్టే ఉంటే కేవీటీ పిటిషన్ వేయలేదా అని ప్రశ్నించారు. సొసైటీ చైర్మన్, సీఈఓపై కోర్టులో కేసు ఉందని డీసీఓ చెప్పారు. అవినీతికి పాల్పడిన వారిపై త్వరగా చర్యలు తీసుకొని రికవరీ చేయాలని మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. మాజీ ఎమ్మల్యే పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి పదవిలో ఉన్న కాలంలో అవినీతి జరగడంతో ఎంపీ ఈ అవినీతి పై ఘాటుగా మాట్లాడి ఉంటాడని పలువురు భావిస్తున్నారు.

Advertisement

Next Story