కొడుకును కాపాడాలని కన్న తల్లి ఆవేదన.. ప్రాణాపాయ స్థితిలో ఇంటి పెద్ద దిక్కు

by Mahesh |
కొడుకును కాపాడాలని కన్న తల్లి ఆవేదన.. ప్రాణాపాయ స్థితిలో ఇంటి పెద్ద దిక్కు
X

దిశ, దుబ్బాక: రచమల్లు మణికంఠ అనే యువకుడు తన కులవృత్తి (మంగళి) పని చేసుకుంటూ ఇంటికి పెద్దదిక్కుగా ఉన్నాడు. కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ... ఇంటిని పోషిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన రాచమల్లు మణికంఠ మంగళవారం ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మణికంఠ హైదరాబాదులో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అతనికి తోడు ఇద్దరు సోదరిలు ఉన్నారు. పెద్ద సోదరి వివాహం చేశారు. అలాగే మరో సోదరిని చదువుకుంటుంది. మణికంఠ తల్లి ఒక్కరే కష్టపడడం చూసి చిన్నతనంలోనే తాను చదువును మధ్యలోనే వదిలేసి కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకొని కులవృత్తి (మంగళి) పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచిన మషికంఠ రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఒక్కసారిగా ఆ ఇంట్లో తినే కంచంలో మన్ను పోసినట్టు అయింది. మణికంఠ సోదరి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ విలపించారు. కడు పేదరికం తో, ఒక వైపు బిడ్డను కాపాడుకోవాలని, చేతిలో చిల్లిగవ్వ లేక అల్లాడుతూ దాతల కోసం ఎదురు చూస్తూ రోదిస్తున్నారు. దాతలు, దయా హృదయులు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని, ప్రభుత్వం, అధికారులు ఆదుకొని నా బిడ్డను కాపాడాలని ఆ తల్లి వేడుకుంటుంది. ఎవరైనా వారికి సహాయం చేయాలనుకుంటే 9966036214 ( రచమల్లు మణికంఠ ) నెంబర్ ను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed