జెండాలు ఎజెండాలు పక్కనపెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం: Raghunandhan Rao

by S Gopi |   ( Updated:2023-01-11 10:58:08.0  )
జెండాలు ఎజెండాలు పక్కనపెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం: Raghunandhan Rao
X

దిశ, చేగుంట: గ్రామాల అభివృద్ధి కోసం జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని ఇబ్రహీంపూర్, రెడ్డిపల్లి, కసాన్పల్లి, పెద్ద శివనూర్, చిన్న శివునూరు తదితర గ్రామాలలో తన సొంత నిధులతో ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించారు. సుమారు పది లక్షల రూపాయల వ్యయంతో లైట్లను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెనుకబడ్డ దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చేయడం కోసం అందరం కలిసి పనిచేసుకోవాలని సూచించారు. తాను గెలిచే నాటికి ప్రారంభం కాకుండా ఉన్న గోదాములను నిర్మించడానికి కృషి చేసినట్టు వెల్లడించారు. అందరము కలిసి దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు రహదారుల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఐమాక్స్ లైట్ల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు వెంట మండల వైస్ ఎంపీపీ రామచంద్రం, ఇబ్రహీంపూర్ సర్పంచ్ రాములు, ఎంపీటీసీ భాగ్యమ్మ, మండల బీజేపీ అధ్యక్షులు చింతాల భూపాల్, గొల్లపల్లి సర్పంచ్ ఎల్లారెడ్డి, కసాన్ పల్లి సర్పంచ్ నరసమ్మ, మాజీ సర్పంచులు నాగభూషణం, బాలచందర్, బీజేపీ నాయకులు కుమ్మరి భూపాల్, రతన్లాల్, ఈద స్వామి తోపాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed