MLA లాస్యనందిత మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు: మాజీ మంత్రి హరీష్ రావు

by Satheesh |   ( Updated:2024-02-23 04:48:17.0  )
MLA లాస్యనందిత మరణం బీఆర్ఎస్‌కు తీరని లోటు: మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, పటాన్ చెరు: చిన్న వయసులోనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పటాన్ చెరు ఓఆర్ఆర్ పైన రోడ్డు ప్రమాదంలో మృతి చెంది పటాన్ చెరు అమేధ ఆసుపత్రిలో ఉన్న లాస్య నందిత భౌతికకాయాన్ని హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా లాస్య నందిత కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం చెప్పి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. లాస్య నందిత తండ్రి, దివంగత నేత సాయన్న మరణించిన సంవత్సర కాలంలోనే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడం తనను కలచివేసిందన్నారు.

యువ ఎమ్మెల్యేగా ప్రజలకి సేవ చేస్తున్న లాస్య నందిత అకాల మరణం కంటోన్మెంట్ ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. లాస్య నందిత కుటుంబం ఈ విషాదం నుంచి బయట పడేలా ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని వేడుకున్నారు. ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story