Leakage: నీరు వృధాగా పోతున్న.. పట్టించుకోరేం

by Aamani |
Leakage: నీరు వృధాగా పోతున్న.. పట్టించుకోరేం
X

దిశ,చౌటకూర్ : మండలం పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలిపోయింది. నీరంతా వృధాగా పోతుంది. పైప్ లైన్ పగిలిపోవడంతో అందులో నుంచి వాటర్ పైకి ఎగిసిపడుతోంది. పక్కన ఉన్న పంట పొలాలకి నీరంతా చేరుతుంది.నేషనల్ హైవే అకోలా - నాందేడ్ 161 జాతీయ రహదారి పక్కన ప్రయాణికులు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో సేకరించారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పైప్ పగిలింది. నీరంతా వృధాగా పోతుంది.

పట్టించుకోని అధికారులు కరువయ్యారు. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరుగుతుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే వచ్చి పైప్ లైన్ లీకేజీ కాకుండా ఆపాలని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టడం తెలిసింది. ఇంటింటికి మంచినీటి నీటిని సరఫరా చేసే ఈ పనిని అమలు చేస్తుంది. అయితే కొన్నిచోట్ల తరచుగా పైపులైను లీకేజి వృధాగా పోతుంది. పోతుందని అధికారులు నిర్లక్ష్యం కొట్టేసినట్టు కనిపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story