- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు హరీష్ రావు, కేటీఆర్
దిశ సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట పట్టణంలో అభివృద్ధి పనులకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. సిద్దిపేట పట్టణ శివారు ఇర్కోడ్ లో 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మోడ్రన్ స్లాటర్ హౌజ్ ను, స్లాటర్ హౌస్ లో ఏర్పాటు చేసిన జిల్లా గ్రామీణభివృద్ధి సంస్థ మహిళా ఉత్పత్తులు, ఇర్కోడ్ నాన్వెజ్ పచ్చళ్ళు, పంచాయతీ శాఖ వారి సేంద్రియ ఎరువు స్టాళ్లను మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలిసి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. సిద్దిపేట పట్టణంలోని కోటిలింగాల పెద్ద గుడి వద్ద 20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.3 కోట్ల 33 లక్షలతో కప్పలకుంట చెరువు సుందరీకరణ పనులకు, పట్టణంలోని గద్ద బొమ్మ వద్ద అమృత్ (2.0) పథకంలో రూ. 87 కోట్ల 50 కోట్ల రూపాయలతో చేపట్టిన నీటి ఉపరితల ట్యాంకుల నిర్మాణం, నీటి సరఫరా పైపుల నిర్మాణానికి మంత్రి హరీష్ రావు తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పరిషత్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.