Minister Sridhar Babu : డ్రైవర్ రహిత వాహనాల తయారీ అద్భుతం

by Aamani |   ( Updated:2024-08-26 12:33:17.0  )
Minister Sridhar Babu : డ్రైవర్ రహిత వాహనాల తయారీ అద్భుతం
X

దిశ, సంగారెడ్డి అర్బన్ : డ్రైవర్ రహిత ఫోర్ వీలర్ వాహన తయారీ ఎంతో అద్భుతమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కొనియాడారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ ని ఆయన సందర్శించారు. ఇందులో భాగంగా టిహాన్ వేదికగా జపాన్ కు చెందిన సుజుకి కంపెనీ సంయుక్త సహకారంతో నూతనంగా తయారు చేసిన డ్రైవర్ రహిత ఫోర్ వీలర్ వాహనాన్ని ఆయన పరిశీలించారు. అక్కడే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తో కలిసి ఆయన ఐఐటి క్యాంపస్ లో డ్రైవర్ రహిత వాహనంలో ప్రయాణించారు. అనంతరం ఆయన మాట్లాడారు.

పరిశోధనలకు కేంద్రబిందువు ఐఐటీ హైదరాబాద్..

ప్రపంచం మెచ్చేలా ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు డ్రైవర్ రహిత వాహనాన్ని తయారు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకోసం గత మూడు సంవత్సరాలుగా ప్రతి పల్లె, పట్టణాలతో పాటు హైదరాబాద్ వంటి మహానగరంలో రోడ్లపై ఈ వాహనానికి అవసరమైన ట్రాఫిక్ సమస్యను అధిగమించేలా అనేక పరిశోధనలు చేయడం జరిగిందన్నారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ పరిశోధనల తర్వాత డ్రైవర్ రహిత వాహనాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకురావడం గొప్ప విషయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ తో పాటు ఇందుకు కృషి చేసిన పరిశోధకుల బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. మరిన్ని సరికొత్త పరిశోధనలను ఐఐటీ హైదరాబాద్ వేదికగా ముందుకు తీసుకొస్తారని ఆశ భవాని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి, జపాన్ సుజుకి మోటార్స్ కంపెనీ ప్రతినిధి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story