- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూ ఆర్ గ్రేట్ సార్.. మంత్రి హరీష్ రావును ప్రశంసించిన మంత్రి కేటీఆర్
దిశ సిద్దిపేట, ప్రతినిధి : మంత్రి కేటీఆర్, మంత్రి తన్నీరు హరీష్ రావును యూ ఆర్ గ్రేట్ సార్ అని అభినందించారు. మీ కృషితో సిద్దిపేట పట్టణం దేశంలోనే అన్ని రంగాలలోనెంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు. సిద్దిపేట పట్టణంలోని స్వచ్ఛ బడిని మంత్రి హరీష్ రావుతో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సందర్శించారు. సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంక్, ఋతుప్రేమ కార్యక్రమం, హోం కంపోస్టింగ్ సెంటర్, డ్రం కంపోస్టర్, సేంద్రియ ఎరువుల కేంద్రం, డిజిటల్ క్లాస్ రూమ్, మున్సిపాలిటీ వారిచే ఏర్పాటు చేసిన శాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంను వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రంగా అభివృద్ధి చేద్దామని మంత్రి కేటీఆర్ అన్నారు.
సిద్దిపేట చుట్టుప్రక్కల సిరిసిల్ల పట్టణంతో సహా 50 కిలోమీటర్ల పరిధిలో గల పట్టణాల నుండి వెస్ట్ సేకరించి రి యూజ్ వస్తువులను తయారు చేద్దాం అన్నారు. ఎలక్ట్రానిక్ వెస్ట్, భవన నిర్మాణ వెస్ట్ ప్లాంటులను ఏర్పాటు చేద్దాం అన్నారు. పట్టణంలో ఉత్పత్తి అయ్యే అన్ని రకాల చెత్తను 100% రీ యూజ్ చేద్దాం అన్నారు. పిల్లలకు లైవ్ మోడల్ లో చెత్త సేకరణ రి యూజ్ చక్కగా చూపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి , రాష్ట్ర నర్సింగ్ బోర్డు సభ్యులు పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.