- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైద్య రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు : Minister Harish Rao
దిశ, సిద్దిపేట ప్రతినిధి: వైద్య రంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల రూ.43.20 కోట్లతో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.134 కోట్లు వైద్యాభివృద్ధికి వినియోగిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ప్రభుత్వ కేంద్రీయ ఔషధ గిడ్డంగి, 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణాలకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుతో రోగులకు మందులు సకాలంలో అందించే వీలుంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందించే మందుల సంఖ్యను 720 నుండి 843 కు పెంచినట్లు వెల్లడించారు. ప్రతి ఆస్పత్రిలో 3 నెలలకు సరిపడా మందులు ఉంచేలా వైద్య శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో తొలిసారి రూ.20 కోట్లతో బయో మెడికల్ ఎక్విప్ మెంట్ మెయింటనెన్స్ పేరిట వైద్య పరికరాల నిర్వహణకు పాలసీ రూపొందించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో కొత్త డైట్, శానిటేషన్ పాలసీ సైతం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య ప్రమాణాలు పెంపు లక్ష్యంగా పారిశుద్ధ్య కార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం బెడ్ ఒక్కింటికి పారిశుద్ధ్య ఖర్చును 5 వేల నుంచి 7,500 పెంచినట్లు తెలిపారు. ఇందు కోసం ప్రతీ ఏటా రూ. 338 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.
డైట్ ఛార్జీలు రెట్టింపు చేసినట్లు, టీబీ, క్యాన్సర్ తదితర రోగులకు బలవర్థకమైన ఆహారం అందించేలా.. ఒక్కో బెడ్ కు డైట్ ఛార్జీలు రూ.56 నుంచి రూ. 112 పెంచినట్లు, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ చార్జీలు బెడ్ ఒక్కింటికి రూ.40 నుంచి రూ.80 పెంచినట్లు తెలిపారు. ఇందు కోసం ఏటా రూ.43.5 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాదులోని 18 మేజర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సహాయకులకు మూడు పూటల భోజన సదుపాయం కల్పించేందుకు సంవత్సరానికి రూ.38.66 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 20 సర్కారు ఆస్పత్రిలో మురుగు శుద్ధి ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నాణ్యమైన సంప్రదాయ వైద్యం..
ప్రకృతి వైద్యానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్ గా నిలిపేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్ధిపేటలో రూ.15 కోట్లతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయూష్ ఆయుర్వేదం, యోగ, నాచురోపతి, యునాని, సిద్ధ, హోమియో తదితర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. నేచర్ క్యూర్ ఆసుపత్రిని రూ.6 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సిద్ధిపేట తరహాలోనే వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి లో 50 పడకల తో కూడిన ఆయూష్ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 834 ఆయుష్ డిస్పెన్సరీలు, 5 కళాశాలలు, 4 రీసెర్చ్ ఆస్పత్రిలో అన్నీ రకాల వ్యాధులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా ఆయుర్వేదంలో పంచకర్మ విధానం ద్వారా వెన్నెముక కీళ్ల సమస్యలు పక్షవాతం, దీర్ఘకాలిక రోగ సమస్యలకు చికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. హోమియో వైద్యం ద్వారా చర్మ సమస్యలు, ఎలర్జీ సహా అనేక దీర్ఘకాలిక రోగ సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. యునాని వైద్యం ద్వారా రెజిమెంటల్ థెరపీ ద్వారా పక్షవాతం, ఇతర నరాల సమస్యలకు చికిత్స అందిస్తున్నట్లు, అలాగే యోగ, నాచురోపతి ద్వారా మానసిక సమస్యలు దూరం చేసి, మనస్సును శరీరాన్ని ఎలా నియంత్రణలో పెట్టాలో తర్ఫీదు ఇస్తున్నట్లు తెలిపారు. నార్మల్ డెలివరీలు పెంచేలా వేమన యోగ రీసెర్చ్ ఇన్సిట్యూట్ ద్వారా జిల్లాలో గర్భిణీలకు యోగ తరగతులు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
బీఆర్ కేఆర్ ఆయుర్వేద కళాశాల, వరంగల్ ఆయుర్వేద కళాశాలల ద్వారా మంచి వైద్య సేవలు అందుతున్నాయి. ప్రసూతి తంత్ర, స్త్రీ రోగ విభాగాల ద్వారా గర్భిణీలకు వైద్య సేవలు అందిస్తున్నామని, ఇదే విధంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేయబోతున్న 50 పడకల ఆయూష్ ఆస్పత్రిలో అన్ని రకాల ఆయూష్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ విమలా థామస్, డీఎంహెచ్ఓ డాక్టర్ కాశీనాథ్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మెడికల్ కళాశాల నిర్మాణ పనులు మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని వైద్యశాఖ ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు.
READ MORE