వేంకటేశ్వర స్వామికి స్వర్ణ కిరీటం సమర్పించిన Minister Harish Rao

by Satheesh |   ( Updated:2023-01-02 09:55:12.0  )
వేంకటేశ్వర స్వామికి స్వర్ణ కిరీటం సమర్పించిన Minister Harish Rao
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్న సిద్దిపేట మోహినీ పుర శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి స్వర్ణ కిరీటంతో భక్తులకు దర్శమిస్తున్నాడు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం ఉదయం 4గంటల నుండి ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉత్తర వైకుంఠ ద్వారం ద్వారా శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి, భక్తుల సహకారంతో తయారు చేయించిన స్వర్ణ కిరీటాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామికి మంత్రి హరీష్ రావు సమర్పించారు.

అంతకు ముందు మంత్రి హరీష్ రావుకు ఆలయ పురోహితులు పుర్ణకుంభంతో స్వాగతం పలికి, శాలువతో సత్కరించి, వేద ఆశీర్వాదం అందజేశారు. ఈకార్యక్రమంలో మున్సిపాల్ చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి, ఆలయ చైర్మన్ అమరేష్ విష్ణు, ధర్మకర్తలు గుండు రవితేజ, అందే శ్రీనివాస్ రెడ్డి, బెల్లంకొండ వెంకటేశ్వర్లు, కాసునగొట్టు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

అదే విధంగా పాత వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట శృంగేరి వేద పాఠాశాలలో రజతోత్సవం పురస్కరించుకొని శ్రీ కృష్ణ యజుర్వేద స్వాహాకార సప్తాహం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. పట్టణంలోని రావిచెట్టు హనుమాన్ దేవాలయం, సీతారామచంద్ర స్వామి దేవాలయలం, సత్యనారాయణ స్వామి దేవాలయాలల్లో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story