- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందు అమలు చేయండి : Minister Harish Rao
దిశ, సిద్దిపేట ప్రతినిధి : కాంగ్రెస్, బీజేపీ నేతల తీరు పై రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వాళ్ల నోటికి మొక్కాలి, వాళ్ళు తెలంగాణలో వచ్చేది లేదు సచ్చేది లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాలలో వెయ్యి రూపాయల పింఛన్ మత్రమే ఇస్తూ...తెలంగాణలో మాత్రం అంత ఇస్తాం ఇంత ఇస్తాం అని నోటికి ఏదోస్తే అదే మాట్లాడుతున్నారన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో మొదట డిక్లరేషన్ అమలు చేయాలని మంత్రి తన్నీరు.హరీష్ రావు చురకలంటించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని కొండా భూదేవి గార్డెన్ లో బీడీ టేకేదార్లకు నూతన పింఛను మంజూరు, దివ్యాంగులకు పింఛన్ల పెంపు పత్రాల పంపిణీ, జూనియర్ పంచాయితీ కార్యదర్శిల ఉద్యోగ క్రమబద్దీకరణ ఉత్తర్వుల మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఖర్గే మొదట డిక్లరేషన్ చేసి, ఇక్కడ తర్వాత డిక్లరేషన్ చేయాలన్నారు. కాంగ్రెస్ నాయకులు డిక్లరేషన్ మీద డిక్లరేషన్ చేస్తున్నారని, ఏ డిక్లరేషన్ చేసినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలల్లో ముందుగా అమలు చేయాలన్నారు. బండి సంజయ్ జీహెచ్ఏంసీ ఎన్నికల్లో బండి పోతే బండి ఇస్తామని చెప్పారని ఇప్పటికీ బండి లేదు.. గుండు లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వెయ్యికి మించి పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించిన సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని వికలాంగులు దీవించాలని కోరారు.
దేశంలో దివ్యాంగులను గౌరవించిన ఒకే నాయకుడు కేసీఆర్ అన్నారు. దేశంలోనీ 16 రాష్ట్రాల్లో బీడీలు చేసేవారు ఉంటే ఎక్కడ బీడీ పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. బీడీ కార్మికులకు, బీడీ టేకేదార్లకు 2016 పెన్షన్ ఇస్తున్నా ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కతుందన్నారు. మనకు అన్నం పెట్టే సీఎం కేసీఆర్ మనం కాపాడుకోవాలని కోరారు. జిల్లాలో జూనియర్ పంచాయితీ సెక్రటరీలు బాగా పని చేసి జిల్లాకు అవార్డుల పంట పండించారని అభినందించారు. జిల్లాలో 167మందికి రెగ్యులర్ చేస్తున్నామని, మిగిలిన 11 మందిని త్వరలోనే చేస్తామని హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలు వంటేరు యాదవ రెడ్డి, కూర రఘోతం రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి క్యాంప్ కార్యాలయంలో సిద్ధిపేట రూరల్ మండలం లోని పలు గ్రామ కుల సంఘ భవనాలకు రూ.59.50 లక్షల ప్రొసీడింగ్ కాపీలు ఆయా కుల సంఘాల ప్రతినిధులకు మంత్రి హరీశ్ రావు అందజేశారు. అదే విధంగా నియోజకవర్గం పరిధిలోని ఆరు దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వ మంజూరు చేసిన రూ. 1కోటి 98 లక్షల 50 వేలు మంజూరు పత్రాలను అయా దేవాలయాల ప్రతినిధులకు మంత్రి హరీష్ రావు అందజేశారు.