- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘నో రిస్క్.. రెఫర్ టూ గాంధీ’ దిశ కథనంపై స్పందన
దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో మన వారు.. పరాయి వాళ్లు అనే భేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. వైద్యం చేయకుండా నిర్లక్ష్యంగా మాట్లాడిన వైద్యుడిపై ఫిర్యాదు వస్తే వెంటనే మెమో ఇచ్చి సెలవుపై పంపిన అధికారులు.. పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణీకి కాన్పు చేయకుండా గాంధీ ఆసుపత్రికి సిఫార్సు చేసిన వారిపై ఎలాంటి చర్య తీసుకుంటారని పలువురు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. దిశ పత్రికలో ‘నో రిస్క్.. రెఫర్ టూ గాంధీ’ అనే కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.. నవాబ్ పేట కు చెందిన గర్భిణీ సంధ్య పురిటి నొప్పులతో వస్తే రక్తహీనత ఉందన్న కారణం చూపి రిస్క్ ఉందని కుటుంబీకుల కు చెప్పి గాంధీకి సిఫార్సు చేశారు. గాంధీకి వెళ్లి అక్కడ ఇబ్బందులు పడేకంటే ఇక్కడే అప్పు చేసి ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కానీ ఇక్కడే మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఇచ్చిన రక్తహీనత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వైద్యాధికారుల తీరుపై పలు విమర్శలు వెల్తువెత్తుతున్నాయి. ఏదేమైనా ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో అన్న విషయం ఆసక్తి నెలకొంది.
ప్రభుత్వ ఆసుపత్రిలో సంధ్యకు హిమోగ్లోబిన్ 8.5 శాతం మాత్రమే ఉందన్న కారణంతో అందుబాటులో రక్తం లేదన్న సాకుతో గాంధీకి సిఫార్సు చేశారు. కానీ గంట వ్యవధిలో ప్రైవేట్ లో హెచ్ బీ 12 శాతం వచ్చింది. సుఖ ప్రసవం అయింది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి లోపాలను ఎత్తి చూపుతుంది.. ఆదివారం వచ్చిన గర్భిణుల్లో నలుగురిని గాంధీకి సిఫార్సు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో సంధ్యకు ప్రైవేట్ లో హెచ్ బీ 12 వచ్చింది. మిగతా వారికి పరీక్షలు చేస్తే వారి హెచ్ బి ఎంత ఉందో తెలిసేది.. కానీ వారు ఎక్కడికి వెళ్లారో సమాచారం లేదు. అయితే సంధ్య కుటుంబీకులు వైద్యాధికారులు తీరుపై దాదాపు రూ.50 వేలు ఖర్చు చేసి ప్రైవేట్ లో సర్జరీ చేయించారు. ఇది వైద్యాధికారులకు మామూలుగా కనిపిస్తున్నా, ఆ పేద కుటుంబం నెలల పాటు పని చేసి అప్పు తీర్చాల్సిన పరిస్థితులు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం మచ్చుకు మాత్రమే. ఇది ఇక్కడ సర్వసాధారణంగా పలువురు వాపోతున్నారు. ఇంత జరిగినా ప్రభుత్వ ఆసుపత్రిలో మార్పు వస్తుందా అంటే సాధ్యం కాదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల బొక్కల డాక్టర్ జగదీశ్వర్ ఆసుపత్రికి వచ్చిన రోగి పట్ల నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని జిల్లా కలెక్టర్ కు ఓ కౌన్సిలర్ ఫిర్యాదు చేస్తే వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ మెమో జారీ చేశాడు. ఈ విషయంలో సాక్షాత్తు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసినా పట్టించుకోకుండా.. మరో మెమో జారీ చేసి సెలవుపై వెళ్లేలా ఒత్తిడి చేసి పంపించారన్న ఆరోపణలు ఉన్నాయి. అంత స్ట్రిక్ట్ గా ఉండే అధికారులు తప్పుడు రిపోర్ట్ ఇచ్చి వైద్యం చేయకుండా ప్రైవేట్ వైపు వెళ్లేలా చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతుంది. నలుగురు గర్భిణులను గాంధీకి సిఫార్సు విషయంలో తీసుకునే చర్యలపై అధికారుల తీరు ఆధారపడి ఉంది. నిర్లక్ష్యంగా ఉన్న వైద్యుడిని ఇక్కడి నుంచి పంపించినా అదే అధికారి తప్పుడు రిపోర్టు ఇచ్చి గర్భిణీ కుటుంబీకుల్లో ఆందోళన కలిగించడంతో పాటు ప్రైవేట్ కు వెళ్లేలా చేసిన వారి పై చర్యలు తీసుకుంటారా.. లేక ఉన్నదే తక్కువ సిబ్బంది.. పని చేసే వారిపై చర్యలు తీసుకుంటే మళ్ల ఎవరు చేస్తారన్న పాత మాటలతో తోచిపుచ్చుతారా ?అన్నది తేలాల్సి ఉంది.