సమాచారం చేరవేయడంలో మీడియా ది కీలక పాత్ర.. అడిషనల్ కలెక్టర్

by Sumithra |
సమాచారం చేరవేయడంలో మీడియా ది కీలక పాత్ర.. అడిషనల్ కలెక్టర్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రజలకు సరైన సమాచారం చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి ఔట్ రీచ్ యాక్టివిటీ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) సిద్దిపేటలో ప్రాంతీయ మీడియా వర్క్ షాప్ ‘వర్తాలాప్’ ను నిర్వహించారు. పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పటేల్, పీబీఐ జాయింట్ డైరెక్టర్ వీ.బాలకృష్ణ, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ వర్క్ షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి జర్నలిస్టులు సానుకూల సందేశాలను ప్రచారం చేసి వాటి నుండి ప్రజలు ప్రయోజనం పొందేలా చూడాలని కోరారు. మీడియా అప్రమత్తంగా ఉండాలని, తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టాలన్నారు.

పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శృతి పటేల్ పీఐబీ నిర్మాణం, విధులు, పాత్ర గురించి వివరించారు. పీబీఐ జాయింట్ డైరెక్టర్ వీ. బాలకృష్ణ మాట్లాడుతూ వార్తాలాప్ అనేది అట్టడుగు స్థాయి నుండి మెరుగైన సమర్థవంతమైన సమాచార ప్రవాహాన్ని నిర్ధారించడానికి ప్రభుత్వం, మీడియా మధ్య సంబంధాలను బలోపేత చేయడానికి ఒక వేదిక అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డా. ఎస్.రాము, ఫాక్ట్ చెక్ ట్రైనర్ సత్య ప్రియ జర్నలిజంలో ఉత్తమ పద్దతులు, వాస్తవ తనిఖీ యంత్రాంగంతో నకిలీ వార్తలను ఎదుర్కోవడంకు సంబంధించిన అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్వో రవికుమార్, జర్నలిస్టులు కొమురవెల్లి అంజయ్య, బబ్బురి రాజు, అరుట్ల యాదవరెడ్డి తదితరులు పొల్గొన్నారు.

Advertisement

Next Story