- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన వస్తువులు..

X
దిశ,జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణం లోని రామన్నపేట లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గురు కృప సామిల్ (కట్టెల మిషన్)లో అర్ధరాత్రి ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో ఈ ప్రమాదం జరిగింది. సామిల్ ముందు ఉన్న దుకాణంలో అద్దెకు ఉంటున్న మారుతి కార్పెంటర్ కు సంబంధించిన రూ.2 లక్షలకు పైగా విలువైన పల్సర్ ద్విచక్ర వాహనం, పలు మిషన్లు ఈ ప్రమాదంలో అగ్నిలో పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో సకాలంలో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకోవడం తో పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా సమాచారం అందుకున్న మాజీ కౌన్సిలర్ నామ రవికిరణ్, విద్యుత్ సిబ్బంది , స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో మంటలు ప్రక్కనున్న వ్యాపార సముదాయాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story