- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మల్లన్నసాగర్ తో దుబ్బాక ప్రాంతం సస్యశ్యామలం: ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి
దిశ, దుబ్బాక: మల్లన్నసాగర్ తో దుబ్బాక ప్రాంతం సస్యశ్యామలం అవుతోందని, రైతు సంక్షేమమే.. ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో సోమవారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ శేర్ల కైలాస్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ చింతల జ్యోతి కృష్ణ తో ప్రారంభించారు. ఆకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎంపీ పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడారు. ఆధైర్య పడొద్దని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవొద్దన్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు మద్దతు ధరనిస్తూ.. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మల్లన్నసాగర్ తో దుబ్బాక ప్రాంతం సస్యశ్యామలం అయిందన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామని తెలిపారు. కేంద్రం చేతులెత్తేసినా రాష్ట్రం ప్రభుత్వం ధాన్యాన్ని కొంటామని సీఎం చెప్పడం రైతుల పట్ల ఉన్న అభిమానం అని ఎంపీ అన్నారు.
ధాన్యం తూకాల్లో మోసాలు, కాంటా చేసిన బస్తాల్లో తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని కొనుగోలు కేంద్రం నిర్వాహకులను హెచ్చరించారు. ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.2,060, సాధారణ రకం ధాన్యానికి రూ.2,040 మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గన్నె వనిత భూంరెడ్డి రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి, ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గుండెల్లి ఎల్లారెడ్డి, సీనియర్ నాయకులు రొట్టె రాజమౌళి, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.