- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెదక్ జిల్లాలో జోరుగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు
దిశ, మెదక్: మెదక్ జిల్లాలో జోరుగా కాంగ్రెస్ పార్టీ ఆన్ లైన్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మామిళ్ల ఆంజనేయులు తెలిపారు. మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం 10 వేలు దాటిన సందర్భంగా శుక్రవారం మెదక్‌లో మీడియాతో మాట్లాడారు. ఒక్క పోలింగ్ బూత్‌లో 300 సభ్యుత్వాలు నమోదు చేసిన నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు 2 లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. నియోజకవర్గంలో 1000 సభ్యత్వాలు నమోదు చేసిన నాయకులకు, కార్యకర్తలకు రాహుల్ గాంధీ తో సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.
దేశంలో అత్యధిక సభ్యత్వం కలిగి ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. నియోజకవర్గంలో 35 వేల సభ్యత్వం లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10 వేల సభ్యత్వాలు నమోదు అయ్యాయని, మామిళ్ల ఆంజనేయులు తెలిపారు. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గంలో 35 వేల సభ్యత్వ నమోదు లక్ష్యమన్నారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ బలపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సలీం, సిద్ధయ్యతో పాటు 5 వ వార్డు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.