కరెంట్ షాక్ తో లారీ డ్రైవర్ మృతి

by Sridhar Babu |   ( Updated:2023-12-31 13:41:01.0  )
కరెంట్ షాక్ తో లారీ డ్రైవర్ మృతి
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్రహ్మణ్యంకు చెందిన నర్సరీలో లోడ్ కోసం వచ్చిన లారీ డ్రైవర్ విద్యుత్​ షాక్ కు గురై మృతి చెందాడు. మృతుడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుడు బూడిద మహేష్(26)గా గుర్తించారు. ఆదివారం ఉదయం నర్సరీలోని మామిడి

మొక్కలను జహీరాబాద్ నుంచి రాజమండ్రి , కడియంకు తరలించాల్సి ఉంది. నర్సరీ మొక్కలు లోడ్ చేసేందుకు పొలం వద్ద లారీని రివర్స్ తీసుకొని నిలిపి ఉంచాడు. లారీపై ఉన్న తాడిపత్రిని తీసుకునేందుకు క్యాబిన్ పైకి ఎక్కాడు. పైనున్న కరెంటు తీగలు తగిలి షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి కిష్టయ్య ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Next Story