- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెడికల్ షాపుల ఇష్టారాజ్యం..శాంపిల్స్ జనరిక్ మందులతో దోపిడీ
దిశ, నారాయణఖేడ్: జిల్లాలో మందుల మాయజాలం జోరుగా సాగుతోంది. మందుల దుకాణాల్లో డాక్టర్లకు ఇచ్చే నమూనా, జనరిక్ మందులను కూడా ఎక్కువ ధరలకు యథేచ్చగా విక్రయిస్తూ వ్యాపారులు జేబులు నింపుకుంటున్నారు. శాంపిల్స్ జనరిక్ మందులు వైద్యులకు, మెడికల్ షాపుల నిర్వాహకులకు కాసులు కురిపిస్తున్నాయి. ఒక్క అక్షరం తేడాతో ఉండే అదే రకం డ్రగ్స్ ను విక్రయిస్తూ దోచుకుంటున్నారు. ఖరీదైన బ్రాండ్ల పేరు చెబుతూ.. ప్రజల కోసం కేంద్రం నుంచి తక్కువ ధరకు వస్తున్న జనరిక్ మందులు ఇస్తున్నారు. వీటి పనితీరులో పెద్ద తేడా లేకున్నా.. వసూలు చేస్తున్న తీరులో మాత్రం నాలుగైదు రేట్ల తేడా ఉంటుంది. పదుల రూపాయలలో కావాల్సిన బిల్లులు రూ. వందలకు పెంచి దోపిడీ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు శూన్యం.
జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపు దోపిడీ జోరుగా సాగుతోంది. ఈ దందాలో కొందరు రైతులు సైతం భాగస్వాములుగా చేరారు. పర్సంటేజీలు తీసుకుంటూ... మెడికల్ షాపులకు రోగులను పంపుతున్నారు. వైద్యులందరూ తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే రాయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా ఏ డాక్టర్ కూడా వాటిని రాస్తున్న దాఖలాలు లేవు. ఇదే అదునుగా భావిస్తున్న మెడికల్ షాప్ లో యజమానులు తక్కువ ధరకు వచ్చే జనరిక్ మందులు చేతిలో పెడుతూ.. ఖరీదైన ప్రైవేట్ మందులకు డబ్బులు వసూలు చేస్తున్నారు. వైద్య పరిజ్ఞానం ఏమాత్రం లేని వారి జేబులు గుల్ల చేస్తున్నారు.
నిలువు దోపిడి..
జనరిక్ మందులు ఇస్తూ, బ్రాండెడ్ మందుల రేట్లు వసూలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. రాష్ట్రానికి శాంపిల్స్ ను మందుల దుకాణాల్లో విక్రయించకూడదనే నిబంధనలు ఉన్నాయి. జనరిక్ మందులను బ్రాండెడ్ మందుల మాదిరిగా ఎమ్మార్పీకి విక్రయిస్తూ లక్షలాది రూపాయలను దండుకుంటున్నారు. మందు ఫార్ములా ఒక్కటే అయినా బ్రాండెడ్ కంపెనీల ధరలకు, జనరిక్ మందుల ధరలను చాలా వ్యత్యాసం ఉంటుంది. బ్రాండెడ్ మందుల కంటే జనరిక్ మందులు ఎమ్మార్పీ ధరల్లో మూడో వంతు ధరకు లభిస్తోంది. కానీ వ్యాపారులు మాత్రం ఎమ్మార్పీ కే విక్రయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలో మందుల దుకాణాలు ఉన్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లోని దుకాణాలతో పాటు డాక్టర్లకు అనుబంధంగా ఉన్న మందుల దుకాణాల్లో ఈ తంతు జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్ చెరు, జోగిపేట్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోని మందుల దుకాణాల్లో ఈ దందా యథేచ్చగా సాగుతోంది. దీంతోపాటు నిషేధిత మందులను సైతం విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ దందా ను నియంత్రించాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరికి నెలనెలా మామూళ్లు ముట్ట చెబుతున్న వ్యాపారులు ఈ దందాను నిర్వహిస్తూ ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారు.
నారాయణఖేడ్ లో అనేకమంది వైద్యులు కాసులకు కక్కుర్తి పడి రోగులకు అవసరం లేని మందులను అంటగడుతున్నారు. అసలే ఇక్కడి ప్రాంతం నిరక్షరాస్యులు కావడంతో ఏం తెలియక పోవడంతో మోసపోతున్నారు. జనరిక్ మందులు నారాయణఖేడ్ ప్రతి ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతుందని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆస్పత్రులను తనిఖీ చేసి ప్రజల జీవితాల నుంచి కాపాడాలని కోరుతున్నారు.
అవసరం లేని మందులు..
వివిధ మందుల కంపెనీల ప్రతినిధులు ఇచ్చే తాయిలాలకు కక్కుర్తి పడి రోగులకు అవసరం లేకున్నా ఆయా మందులను అంటగడుగుతున్నారు. ఒకటి రెండు రకాల మందులతో నయం అయ్యే రోగానికి కూడా ఐదారు రకాల కంపెనీల మందులను రాసి కమీషన్ల రూపంలో వైద్యులు తమ జేబులు నింపుకుంటూ ప్రజలను ముంచుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరంతో వైద్యుని దగ్గరకు వెళ్తే సుమారు ₹1000 విలువ చేసే యాంటిబయాటిక్స్ టాబ్లెట్స్, ఇతర టానిక్ లు తదితర మందులను అంటగడుతున్నట్లు పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జనరిక్ మందుల దుకాణమే లేదు..
జనరిక్ మందులపై ప్రజల్లో అవగాహన అవసరం. జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు జనరిక్ మందుల దుకాణం సంగారెడ్డిలో రెండు, జహీరాబాద్లో ఒకటి, పటాన్ చెరులో ఇటీవలే ఒకషాపు కోసం దరఖాస్తు చేసుకున్నారు.జిల్లా ప్రధాన ప్రదేశాల్లో త్వరలో ఏర్పాటు కాబోతుంది. జనరిక్ మందుల పై వైద్యులు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు సుమారు 10 కేసులు నమోదు చేశాం. ఇందులో నాలుగు కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదయి. ఎన్ పీపీఏ నిర్ణయించిన మందులను ఎమ్మార్పీ ధరలకు విక్రయించవలసి ఉంటుంది. ఎవరైనా నిబంధనలు అధికమిస్తే వారి పైన చర్యలు తీసుకుంటాం.
డాక్టర్ గాయత్రి దేవి, డీఎంఅండ్ హెచ్ఓ