అగ్రస్థానం నిలబెట్టుకుందాం: మంత్రి హరీష్ రావు

by Kalyani |
అగ్రస్థానం నిలబెట్టుకుందాం: మంత్రి హరీష్ రావు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: పదవ తరగతి ఫలితాల్లో అగ్రస్థానం నిలబెట్టుకుందామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. పదవ తరగతి పరీక్షల విద్యార్థులు నన్నద్దమవుతున్న క్రమంలో శనివారం జిల్లాలోని విద్యాశాఖ అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మంత్రి హరీష్ రావు టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సారథ్యంలో జిల్లా అన్నిరంగాల్లో ప్రథమ స్థానంలో కొనసాగుతుందన్నారు. గత సంవత్సరం పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలించిందని, అదే స్పూర్తి కొనసాగించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

ఇప్పటికే పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ తో పాటుగా, ప్రత్యేక తరగతులు, అల్ఫహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి 10 మంది విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడి పర్యవేక్షణలో అభ్యసన సాగించేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. పాఠశాలలోనే కాదు ఇంటి వద్ద కూడా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా తల్లిదండ్రులు సహకారాన్ని అందించాలని సూచించారు. 10/10 జీపీఏ సాధించే విద్యార్థులకు రూ.10వేల నగదు బహుమతి, పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సన్మానిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Next Story