- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాలు
దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని 29వ వార్డు సిద్ధార్థనగర్‌లో ప్రధాన రహదారి పక్కన గల సర్వే నెంబర్ 196, ప్లాట్ నంబర్ 6/2లో సంబంధించిన యజమానులు అక్రమంగా, మున్సిపల్ అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. సెల్లార్ అనుమతి లేకుండా సెల్లార్ నిర్మాణం, కమర్షియల్ కానీ ప్రాంతంలో షెటర్ల నిర్మాణాలు, ప్లాట్‌కి 5 ఫీట్లు ముందుకు జరిగి రోడ్డు స్థలాన్ని ఆక్రమించి 5 ఫీట్లు ముందుకు జరిగి నిర్మాణం చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నియమ, నిబంధనలను ఉల్లంఘిస్తూ, అనుమతులు లేకుండా ప్రధాన రహదారి పక్కన నిర్మాణం చేస్తున్నారని పలువురి చెబుతున్నారు. ఇదంతా ప్రజాప్రతినిధులు, అధికారుల చొరవతో నిర్మిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు మామూళ్లకి లోబడి ఇలాంటి నిర్మాణాలకు తావు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. అనుమతికి విరుద్ధంగా భవన నిర్మాణ పనులు పార్కింగ్ స్థలంలో వాణిజ్య భవనం నిర్మిస్తున్నారు. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. సంగారెడ్డి పురపాలక సంఘం పరిధిలోని సిద్దార్ధ నగర్ ప్రెవేశ ద్వారంలో ప్రధాన రహదారికి ఆనుకుని అనుమతి లేని సెల్లర్ నిర్మిస్తున్నారు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా నోటీస్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీని వల్ల భవిషత్‌లో కాలనీలో ప్రధానరహదారిపై పార్కింగ్ సమస్యలు వస్తాయని, ఈ భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని జిల్లా అధికారులను కోరినా ఎలాంటి చర్యలు తీసుకొలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న భవన నిర్మాణ పనులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని కాలనీలో భవిషత్‌లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.