- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంగారెడ్డి సెంట్రల్ జైల్లో లగచర్ల నిందితుడికి గుండెపోటు..
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి సెంట్రల్ జైల్లో లగ చర్ల కేసులో నిందితుడిగా ఉన్న ఖైదీకి గుండెపోటు వచ్చింది. లగ చర్ల కేసులో నిందితుడుగా ఉన్న ఖైదీ ఈర్యా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు సమాచారం. ఖైదీ ఈర్యా నాయక్ అనారోగ్యంతో ఉండగా వైద్య పరీక్షలు చేస్తుండగా గుండెపోటు వచ్చిందన్న విషయం బయటపడింది. వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా మూడు రోజుల కిందట ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించి తీసుకువచ్చారు జైలు సిబ్బంది.
మళ్ళీ బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈసీజీ, 2 డీఏకో పరీక్షలు చేయించారు. గత నెల 11న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ పై దాడి కేసులో రిమాండ్ లో ఉన్న ఖైదీ ఈర్యా గతంలోనే తనకి గుండె సమస్య ఉన్నట్టు వెల్లడించారు. మూడు నెలల కిందే ఇంటి వద్ద ఆస్పత్రికి వెళ్లగా స్టంట్ వెయ్యాలని వైద్యులు చెప్పినట్లు ఖైదీ వెల్లడించారు. కానీ తన ఆర్థిక పరిస్థితుల వల్ల సర్జరీ చేయించుకోలేదని తెలిపారు. రిమాండ్ ఖైదీ ఈర్యాకు సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఖైదీ గుండెపోటు పై జైలు అధికారులు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.