దేవుడికి దీపం పెడితే..ఇల్లు కాలిపోయింది

by Naveena |
దేవుడికి దీపం పెడితే..ఇల్లు కాలిపోయింది
X

దిశ,కోదాడ : దేవుడికి దీపం పెడితే ఇల్లు కాలిపోయిన సంఘటన కోదాడలోని సాయి నగర్ లో చోటు చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం..స్థానికంగా నివాసం ఉంటున్న తోగరు సైదయ్య అయ్యప్ప మాల ధరించాడు. కాగా గురువారం ఇంట్లో పూజ చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఇరుముడి పూజకు సూర్యాపేట వెళ్ళారు. ఈ క్రమంలో దీపం అంటుకొని ఇల్లు కాలిపోయింది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా..మంటలను అదుపు చేశారు. కాగా ఇంటి యజమాని తోగరు సైదయ్య కోదాడ లోని శ్రీరాం చిట్స్ మేనేజర్ గా పని చేస్తున్నట్లు స్ధానికులు తెలిపారు. ఇల్లు కాలిపోవడంతో..సుమారు 30 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed