- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అభివృద్ధిలో ఆదర్శం కుకునూరుపల్లి : గ్రామానికి ఐదు ఐఎస్ఓ సర్టిఫికేషన్లు
దిశ, కొండపాక: అభివృద్ధి కార్యక్రమాల్లో కుకునూరుపల్లి గ్రామం జిల్లాలో ఆదర్శంగా నిలిచిందని జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. కుకునూరు పల్లి గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఐఎస్ఓ సర్టిఫికేషన్లకు ఎంపికైంది. వాటిని గురువారం జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమిల్ ఖాన్ సర్పంచ్ పొల్కంపల్లి జయంతి నరేందర్ ను అభినందించారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
అదేవిధంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జయంతి నరేందర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సర్టిఫికేషన్ రావడం సంతోషకరమన్నారు. గత సంవత్సరం గ్రామ పంచాయతీ నిర్వహణ, ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, రైతు వేదికలకు గుర్తింపు రాగా వాటి రెన్యువల్ తో పాటు ఈ సంవత్సరం అంగన్ వాడీ కేంద్రానికి వచ్చిందన్నారు. ఐదింటికి గుర్తింపు లభించడం గ్రామ ప్రజల సహకారమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఓ ప్రతినిధి శివయ్య, డీఈవో శ్రీనివాసరెడ్డి, ఎంఈవో శ్రీనివాసరెడ్డి, పీఎన్ఆర్ సంస్థ చైర్మన్ పోల్కంపల్లి నరేందర్, సంపత్, తదితరులు ఉన్నారు.