జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి : ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డా.సూర్యవర్మ

by Shiva |
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలి : ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డా.సూర్యవర్మ
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ డా.సూర్యవర్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట కలెక్టరేట్ వద్ద జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరసనకు కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం పరిష్కరించకపోగా.. పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిరంకుశ విధానికి నిదర్శనమన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కోకన్వీనర్ నాయిని నర్సింహారెడ్డి, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ సామల సంతోష్, నాయకులు జంగోని శ్రీనివాస్ గౌడ్, మిద్దె ప్రసాద్, దిలీప్, మోతే కుమార్, బాల్‌రాజ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story