- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశం మరువని దార్శనికుడు జవహర్ లాల్ నెహ్రూ : నీలం మధు
దిశ,పటాన్ చెరు : భారతదేశ తొలి ప్రధానిగా, రాజనీతిజ్ఞుడుగా దేశ అభివృద్ధికి పునాది వేసిన దేశం మరువని దార్శనికుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పండిత్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని గురువారం చిట్కుల్లోని నీలం మధు క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి విముక్తి కలిగిన భారత దేశ తొలి ప్రధానిగా దేశాన్ని అన్ని రంగాల్లో మహోజ్వల ప్రగతి సాధించేలా పాలన కొనసాగించారన్నారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించి ఆధునిక భారతం అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా కృషి చేశారని కొనియాడారు.
నేటి బాలలే రేపటి భవిష్యత్తు అని నమ్మిన నెహ్రూ ను చిన్నారులంతా ముద్దుగా చాచా నెహ్రు అని సంబోధిస్తారని ఆ మహానేత జన్మదినాన్ని బాలల దినోత్సవం గా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆ మహనీయుడు నెహ్రూ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్వీర్యమైన రంగాలను ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో మళ్లీ అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. ఏడాదిలో జరిగిన అభివృద్ధిని ప్రజాక్షేత్రంలో తెలియజేయడానికి నెహ్రు జయంతి నుంచి 26 రోజులపాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవం లో భాగంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ సైనికుడు ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని స్పష్టంగా వివరిస్తూ విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.