సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు ఐఎస్ వో గుర్తింపు

by Shiva |
సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు ఐఎస్ వో గుర్తింపు
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు పొందిన రెండవ మార్కెట్‌గా రికార్డు పొందిన సమీకృత మార్కెట్‌కు తాజాగా వినియోగ దారులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత నిర్వహణ గాను ఐఎస్ వో 9001 గుర్తింపు దక్కింది. తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐ ఎస్‌ వో 9001:2015 సర్టిఫికెట్‌ గుర్తింపు పొందిన తొలి సమీకృత మార్కెట్ గా ఖ్యాతి గడించింది.

2019లో ఫిబ్రవిరిలో రాష్ట్రంలో తొలి సమీకృత మార్కెట్‌ సిద్దిపేటలో ప్రారంభమైంది. సమీకృత మార్కెట్‌లో వినియోగదారుకు తాజా కూరగాయలు, పండ్లు, మాంసం, చేపలను విక్రయదారులు విక్రయించడం, సౌకర్యాలు, పరిశుభ్రత నిర్వహణ తదితర ఆంశాలను పరిశీలించిన అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ప్రతినిధులు ఐ ఎస్‌ వో 9001:2015 సర్టిఫికెట్‌ ను అందిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రంలోనే ప్రథమంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐ ఎస్‌ వో 9001:2015 గుర్తింపు రావడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.

మార్కెట్ కమిటీ చైర్మన్, పాలక మండలి సభ్యులకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మచ్చ విజిత వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఎస్‌ వో 9001:2015 సర్టిఫికెట్‌ రావడం అనందంగా ఉంది. ఇటీవలే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు కు తోడు అంతర్జాతీయ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు. మంత్రి హరీష్ రావు నిత్య పర్యవేక్షణ, సహకారంతోనే అంతర్జాతీయ గుర్తంపు లభించింది. మంత్రి హరిష్ రావుకు పాలక మండలి పక్షాన ధన్యవాదాలు.

Advertisement

Next Story

Most Viewed