- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి రైతుకి నష్టపరిహారం అందిస్తాం : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
దిశ, చేర్యాల : ఆరుగాలం కష్టపడి రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రైతులకు భరోసా ఇచ్చారు. ఆదివారం చేర్యాల వ్యవసాయ మార్కెట్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుదని రైతులు ఎవరు అదైర్య పడవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయకపోయినప్పటికీ, రైతుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ ప్రతిగింజను తిసుకునేందుకు సిద్దంగా ఉన్నాడని ధీమా వ్యక్తంచేశారు. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
ప్రకృతి వైపరీత్యం వలన, అకాల వర్షం వలన నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు ఎవరు ఆందోళన చెందకూడదని సూచించారు. ప్రతి రైతుకు వంట నష్టం పరిహారం అందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిజ్ఞ కొనుగోలు చేస్తూ, మద్దతు ధర కూడా చెల్లిస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బట్టి విక్రమార్క పై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి..
పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పేరుతో జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల మీదుగా మూడు రోజులు పాటు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పాపాన పోలేదన్నారు. అంతే కాకుండా ఒక్క రైతును కూడా ప్రమర్శించిన దిక్కు లేదనీ ఎద్దేవా చేసారు. పాదయాత్రలో రైతులు పండించిన పంటలు దెబ్బతిన్నవి కంటికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఒక వైపు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వర్గం, మరో వైపు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం అంటూ ఇరువర్గాల వారు పాదయాత్రలో గొడవలు పెట్టుకుంటున్నారు. అంతటితో ఆగకుండా ఘర్షణలకు దిగుతూ రైతులను పట్టించుకునే పాపాన పోలేదన్నారు. రాజకీయ ఉనికి కోసమే పాదయాత్రలు చేస్తున్నారని మండిపడ్డారు. క్యాడర్ లేని కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరో మొదలు తేల్చుకోవాలని సూచించారు.
రైతులను పట్టించుకొని కాంగ్రెస్ నాయకులకు జనగామ నియోజకవర్గంలో తిరిగే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిగ్గులేకుండా పాదయాత్రలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం వస్తున్నారని మండిపడ్డారు. గత 10 సంవత్సరాల నుంచి ప్రజలు ప్రజా సమస్యలు గుర్తు రాలేదా అని కాంగ్రెస్ నాయకులపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి విరుచుకుపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రాంత ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో, పీఎసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, ఎంపీపీ కరుణాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూపా రాణి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పుర్మ వెంకట్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, పీఎసీఎస్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.