గుమ్మడిదల మండల కేంద్రంలో పట్టపగలే దొంగల కలకలం..

by Kalyani |
గుమ్మడిదల మండల కేంద్రంలో పట్టపగలే దొంగల కలకలం..
X

దిశ, గుమ్మడిదల: గుమ్మడిదల మండల కేంద్రంలో ఆదివారం పట్టపగలు ఇద్దరు ఇంట్లో చోరీ జరగడం కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. గుమ్మడిదల గ్రామానికి చెందిన చిమ్ముల రవీందర్ రెడ్డి ఇంట్లో అతని భార్య రజిత సమీపంలోని బంధువుల ఇంట్లో సుమారు 11 గంటల సమయంలో పూజ కి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇల్లు తాళం పగల కొట్టి ఉండడం ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం గుర్తించింది. దీంతో ఒక్కసారిగా బీరువా వద్దకు వెళ్లి చూడగా సుమారు 31 తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి, నాలుగు వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. అలాగే మండల కేంద్రానికి చెందిన జె శ్రీనివాస నాయక్ జిన్నారం లో వసతి గృహంలో ఉంటున్న తన కూతురి వద్దకు శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో వెళ్లినట్లు తెలిపారు. తిరిగి తాను ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగిలి ఉండడం ఇంట్లో సుమారు ఐదు తులాల వెండి, 15 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీఐ సురేందర్, ఎస్సై మహేశ్వర్ రెడ్డి పోలీసుల బృందం సీసీ ఫుటేజ్ ల ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed