- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొల్చారంలో వాల్టా చట్టానికి తూట్లు.. అర్ధరాత్రి ఆ పని
దిశ, కొల్చారం: అటవీ సంపద రక్షణ కోసం తీసుకువచ్చిన వాల్టా చట్టానికి అటవీ అధికారులే తూట్లు పొడుస్తున్నారు. అర్ధరాత్రి అటవీ ప్రాంతంలో జేసీబీని పెట్టి టిప్పర్ల ద్వారా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కొల్చారంలోని ఎమ్మార్వో, పోలీస్ స్టేషన్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న వరిగుంతంకు వెళ్లే రహదారికి కుడి పక్కన ఉన్న అటవీ ప్రాంతంనుండి ఎర్రమట్టిని తరలిస్తున్నారు. ఇదేమిటని స్థానికులు ప్రశ్నిస్తే అభివృద్ధి కోసం మట్టిని తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. సామాన్యుడు ఒక ట్రాక్టర్ మట్టిని అటవీ ప్రాంతం నుండి తీసుకువస్తే కేసు నమోదు చేసే అధికారులు ఇలా అర్ధరాత్రి వేళ దొంగచాటుగా మట్టిని తరలించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అర్ధరాత్రి అక్రమ మట్టి రవాణాలో నర్సాపూర్ డివిజనల్ ఉన్నతాధికారి హస్తం ఉన్నట్లు తెలియవచ్చింది. అక్రమ మట్టి రవాణాకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో మట్టిని తవ్వుతున్న జేసీబీతోపాటు టిప్పర్లను సోమవారం అర్ధరాత్రి కొల్చారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మట్టి తరలిందిశ, కొల్చారం: అటవీ సంపద రక్షణ కోసం తీసుకువచ్చిన వాల్టా చట్టానికిపునకు బాధ్యులైన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కొల్చారం గ్రామస్తులు, యువకులు కోరుతున్నారు.