వద్దంటే నిలబెట్టారు..! ఆ రెండు స్థానాల్లో ఓటమిపై బీఆర్ఎస్‌లో అంతర్మథనం

by Shiva |
వద్దంటే నిలబెట్టారు..! ఆ రెండు స్థానాల్లో ఓటమిపై బీఆర్ఎస్‌లో అంతర్మథనం
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల ఓటమి బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థులు చిత్తుగా ఓటమి చెందిన విషయం తెలిసిందే. అయితే తాము వద్దంటే పట్టుబట్టి నిలబెట్టి ఓడగొట్టారని ఇద్దరు అభ్యర్ధులు అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. మెదక్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ లు బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు దగ్గరపడే వరకు ఈ స్థానాల్లో వీరిద్దరి పేర్లు వినిపంచలేదు. చివరకు ఇద్దరిని అధిష్టానం నిలబెట్టడం... ఓడిపోవడం అయిపోయింది. జరిగిన పరిణామాలపై బీఆర్ఎస్ పార్టీలో విస్త్రత చర్చ జరుగుతున్నది. ఆర్థికంగా ఉన్నారని ఇద్దరి బరిలో దింపి ఆగం చేశారని బీఆర్ఎస్ అధిష్టాన తీరును తప్పుబడుతున్నారు.

బతిమాలి ఎంపీగా బరిలోకి...

మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామ్ రె్డి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. వాస్తవానికి మెదక్ స్థానాన్ని గజ్వేల్ కు చెందిన వంటేరు ప్రతాప్ రెడ్డికి ఇవ్వాలని పార్టీ మొదట నిర్ణయించింది. స్వయంగా మాజీ సీఎం కేసీఆర్ కూడా పలు సందర్భాల్లో పార్టీ శ్రేణుల సమక్షంలో ఇదే మాట అన్నారు. ప్రతాప్ రెడ్డి బరిలో ఉంటారని మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఊహించారు. అయితే ప్రతాప్ రెడ్డి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొలేడని భావించిన అధిష్టానం చివరి క్షణంలో వెంకట్రామ్ రెడ్డిని బరిలోకి దింపారు. ఆర్థిక, అంగబలం ఉన్నదని భావించి ఆయనను పోటీలో దింపారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు సిద్దిపేట కలెక్టర్ గా పనిచేసిన ఆయనకు ఈ ప్రాంతంలో మంచి సంబందాలున్నాయి. అన్ని ప్రాంతాల నాయకులతో స్నేహం ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే పదవి ఉన్నప్పటికీ ఆయనైతేనే బాగుంటుందని బీఆర్ఎస్ అధిష్టానం వెంకట్రామ్ రెడ్డిని బరిలో దింపింది.

మెదక్ అడిగితే.. జహీరాబాద్

ఇక జహీరాబాద్ నుంచి బరిలో నిలిచిన గాలి అనిల్ కుమార్ ఆవేదన మరోలా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయనను మెదక్ ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి బీఆర్ఎస్ లో చేర్పించారు. మెదక్ నుంచే పోటీ చేస్తానని కలలుకన్న ఆయన చివరకు జహీరాబాద్ బరిలో నిలవాల్సి వచ్చింది. తనకు ఇష్టంలేదని ఎంత చెప్పినా... మేం చూసుకుంటామని అధిష్టానం హామీ ఇచ్చింది. వాస్తవానికి జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గాలి అనిల్ కు సంబందాలు అంతగా లేవు. తనకు మెదక్ టికెట్ ఇస్టామని చెప్పి జహీరాబాద్ పంపించడంపై ఆయన విముఖత వ్యక్తం చేశారు. అయినా నచ్చజెప్పి బరిలో నిలబెట్టారు.

ఖర్చు పెట్టినా.. తప్పని ఓటమి

మెదక్, జహీరాబాద్ లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు ఆర్థికంగా ఉన్నవారు కావడంతో ఎన్నికల్లో బారీగానే ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఖర్చు చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఈ ఇద్దరిని నిలబెట్టినట్లు నాయకులంటున్నారు. అయితే అటు మెదక్ లో వెంకట్రామ్ రెడ్డి, ఇటు జహీరాబాద్ గాలి అనిల్ కుమార్ లు సాధ్యమైనంద వరకు ప్రచారం చేయడంతో పార్టు ఖర్చలకు కూడా వెనకాడలేదు. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతో ఇద్దరినీ ఓటర్లు ఓడించారు. ఇద్దరి ఓటమి తరువాత రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ అధిష్టానం ఇద్దరినీ నమ్మించి ఆగం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో రాకపోవడం, నాయకత్వం కూడా అనుకున్న స్థాయిలో కష్టపడకపోవడంతోనే ఓటమి పాలయ్యామని అభ్యర్థులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ ఇద్దరు లీడర్లకు అధిష్టానం ఏం బరోసా ఇస్తుందో చూడాల్సి ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed