మోస పోతే.. గోస పాడుతాం..కేసీఆర్

by Naresh |   ( Updated:2023-11-15 15:33:41.0  )
మోస పోతే.. గోస పాడుతాం..కేసీఆర్
X

దిశ, మెదక్ ప్రతినిధి: ప్రతి పక్షాల వచ్చి చెప్పే హామీల పట్ల జాగ్రత్తగా ఉండాలని మోస పోతే గోస పడాల్సి వస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బుధవారం మెదక్ సీఎస్‌ఐ మైదానంలో బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయంటే ఆగమాగం అడవి చేసి ఇష్టం వచ్చిన హామీలు ఇస్తారని అన్నారు. ఇది మంచి పద్దతి కాదని అన్నారు. అభ్యర్థుల గుణ గణాలు, పార్టీల చరిత్ర కూడా చూడాలని సూచించారు. హామీలు ఇస్తున్న పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చూశారో గమనించాలని కోరారు. పార్టీల నడవడిక చూస్తే తెలుస్తుందని, సమర్థులు, ప్రజల కోసం పనిచేసే వారినీ గుర్తించి మీ చేతుల్లో ఉన్న ఓటు ఆయుధంను వినియోగించాలని అన్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో కరెంట్, నీళ్లు లేవని, కానీ ఈ పదేళ్లలో బీఆర్‌ఎస్ ఎలాంటి అభివృద్ధి చేసిందో ప్రజలకు అంతా తెలుసు అన్నారు. సంక్షేమంలో తెలంగాణ దేశంలో మొదటి స్థానంలో ఉందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పెద్ద ప్రమాదం వస్తుందని, రైతుల సాగు ఖర్చులకు ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు దుబారా చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రైతు బంధును రూ. 16 వేలకు పెంచుతున్నామని ప్రకటించారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలని, 24 గంటలు వేస్ట్ అని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నాడని అన్నారు.

మూడు గంటల వస్తె 10 హెచ్‌పీ మోటార్‌లు పెట్టుకోవాలని సలహా ఇస్తున్నారనీ అన్నారు. రైతులు అంత ఖర్చు చేసి ఎక్కడ మోటార్ లు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామని కాంగ్రెస్ అగ్రనేతలు చెబుతున్నారని, ధరణి తీసేస్తే రైతు బంధు, రైతు భీమా పథకాలు బంద్ అవుతాయని అన్నారు. రైతాంగానికి ఉపయోగకరంగా ఉన్న పథకాలు రాకుంటే చేస్తామన్న కాంగ్రెస్ నీ మీ ఓటుతో కన్ను పొడిచేయాలని సూచించారు.



కర్ణాటక డిప్యూటీ సీఎం నాకు సవాల్ విసిరాడు 5 గంటల కరెంట్ ఇస్తామని, ఒరేయ్ సన్యాసి మేము రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని పేర్కొన్నారు. మంజీరా నది ఇప్పుడే చూశా నిండుగా ఉంది, ఇదే మంజీర కాంగ్రెస్ పాలనలో ఎండిపోయి ఉండేదనీ, ఘనపూర్ ఎత్తు పెంపుకు రూ. 100 కోట్లు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని అన్నారు. ఉన్న తెలంగాణను ఊడ గొట్టి 50 యేళ్లు గోస పెట్టిన కాంగ్రెస్ పార్టీ కొత్త రూపంలో వస్తుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎవడో వచ్చి ఏదో చెబితే కాదు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని తెలిపారు. మెదక్‌లో గతంలో అడిగిన వెంటనే రామాయ పేట రెవెన్యూ డివిజన్, డిగ్రీ కళాశాల పద్మ అడిగిన వెంటనే వచ్చాయని, అదే విధంగా పద్మను మళ్ళీ గెలిపిస్తే ఇంజనీరింగ్, రింగ్ రోడ్ లు వస్తాయని తెలిపారు.

పద్మకు కాంగ్రెస్ అభ్యర్థికి పోలిక ఏమైన ఉందా అని అన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, ఎమ్మెల్యే మధన్ రెడ్డీ, దేవేందర్ రెడ్డీ, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, లావణ్య రెడ్డీ, చంద్రపాల్, మల్లికార్జున్ గౌడ్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed