- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో 100 కంపెనీలు పెట్టిస్తా.. కేఏ పాల్ ప్రకటన
దిశ, సంగారెడ్డి : తెలంగాణలో 100 కంపెనీలు పెట్టిస్తా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నాడు. తాను విదేశాలలోని పారిశ్రామిక వేత్తలతో మాట్లాడుతానని తెలంగాణకు పెద్ద కంపెనీలు తెప్పిస్తానని చెప్పాడు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ కు వచ్చిన కేఏ పాల్ గమ్ సిటీ భూములను కొందరు డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని వాటిని ఆపివేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ వల్లూరు క్రాంతికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ నుంచి సదాశివపేటలోని చారిటీ గమ్ సిటీ కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తానని చెప్పారు. ఎంతో మంది పేదలకు తమ గమ్ సిటీ ద్వారా విద్యను అందించానని, కొందరు చేసిన కుట్రవల్ల కార్యకలాపాలు నిలిచిపోయాయన్నారు. గమ్ సిటీ 1200 ఎకరాల విస్తీర్ణంలో ఉందని, కానీ కొందరు ఆ భూములలో 50-60 ఎకరాల్లో డబుల్ రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ఎవరైనా మా బంధువుల మంటూ నా సొసైటీ ఆస్తులు అమ్మడానికి ప్రయత్నిస్తే కొనకండి, ప్రాపర్టీ దోచుకున్న వారిని వదిలిపెట్టను అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
భూముల గురించి అడిగిన గమ్ సిటీ మేనేజర్ మోహన్ దాసుపై దాడి చేశారని దాడి చేసిన వారిని ఎస్పీ శిక్షించాలని కోరారు. రేవంత్ తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి తొమ్మది నెలలైంది. విదేశాలకు నెలకో ట్రిప్పు వేద్దాం, నెలకో పది, 20 కంపెనీలు తీసుకొద్దామన్నారు. ప్రపంచంలో 2891 మంది బిలియనీర్లు ఉన్నారు. నేను తెలియని వారు ఎవ్వరూ లేరు. నేను గ్లోబల్ పీస్ ఇన్విటేషన్ ఇచ్చాను. కానీ నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రాష్ట్రంలో 60 లక్షల నిరుద్యోగులు ఉన్నారు, వారికి ఉద్యోగాలు ఇచ్చే సత్తా నాకుంది అంటూ చెప్పారు. 100 కంపెనీలు తీసుకొచ్చి లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తానని.. డిసెంబర్ 31 లోపున చారిటీ సిటీ ల్యాండ్ లో కంపెనీలు ప్రీగా పెట్టి ఉద్యోగాలు ఇస్తా అన్నారు. గమ్ సిటీలో కంపెనీలు ఏర్పాటు చేసి జిల్లా వాసులకు లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. అక్టోబర్ 2 తరువాత సీఎం రాక పోతే కాంగ్రెస్ లో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పదవి ఊడిపోతుందన్నారు.